విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా నగరంలోని గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top