నన్నయ్య యూనివర్సిటీ ఘటనపై సీఎం సీరియస్‌

విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశం 

రాజమండ్రి: నన్నయ్య యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ విద్యార్థినులను డిపార్టుమెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ సూర్య రాఘవేంద్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. స్పెషల్‌ క్లాసులంటూ తన ప్లాటుకు పిలిపించుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధిత విద్యార్థినులు లేఖ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఎం విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top