మూడు ప్రాంతాల్లో యూనివర్సిటీలు..

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

తాడేపల్లి:  రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డుల జారీపై సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కర్నూలు–కడప–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు– చిత్తూరు, కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా సంబంధిత కాలేజీల్లో సూపర్‌స్పెషాల్టీ కోర్సులపై దృష్టిపెట్టాలని అన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్‌ యూనివర్శిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది మే నెల నాటికి వైద్యారోగ్యశాఖలో సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపి (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి చేయాలని సీఎం ఆదేశించారు.

నాడు – నేడులో చేపట్టే పనులు..

1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అభివృద్ధి పనులు, కొన్నిచోట్ల కొత్తగా నిర్మాణాలు
11 మెడికల్‌ కాలేజీలు, 6 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రుల్లో నాడు– నేడు కింద పనులు.
కొత్తగా 7 మెడికల్‌ కాలేజీలలు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 1 క్యాన్సర్‌ ఆస్పత్రి, 7 నర్సింగ్‌ కాలేజీలు
ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయన్న సీఎం
 

తాజా వీడియోలు

Back to Top