స్కూల్ బిల్డింగ్‌ల క‌ల‌ర్లు ఆహ్లాద‌క‌రంగా ఉండాలి

నాడు-నేడు స‌మీక్ష‌లో సీఎం వైయస్ జ‌గ‌న్‌
 

తాడేప‌ల్లి: స‌్కూళ్ల‌లో చేప‌డుతున్న నాడు-నేడు కార్య‌క్ర‌మం ప‌నులు నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌ని, స్కూల్ బిల్డింగ్‌ల క‌ల‌ర్లు ఆహ్లాద‌క‌రంగా ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నాడు-నేడు కార్య‌క్ర‌మంపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా దాత‌లు చేప‌డుతున్న ప‌నులు ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.సీఎం మాట్లాడుతూ..దాత‌లు చేప‌డుతున్న ప‌నుల‌ను వెంట‌నే క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించాల‌న్నారు. స‌చివాల‌య ఇంజినీర్లు రోజూ నాడు-నేడు ప‌నులు చూడాల‌న్నారు.

Back to Top