ఏపీ చరిత్రలో ఈ పనులు చరిత్రాత్మకం కావాలి

నూతన మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేయాలి

నాడు - నేడు కింద చేపట్టే పనులు భవిష్యత్తు తరాలకూ సంబంధించింది

మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: నాడు - నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలి. ఆస్పత్రుల నాడు - నేడు కింద చేపట్టే పనులకు జూన్‌ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలి. నాడు - నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చు అవుతుంది. నాడు - నేడు కింద చేపట్టే పనులు ఇప్పటి వారికే కాదు.. భవిష్యత్తు తరాలకూ సంబంధించింది. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయి. అందుకే నాడు - నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలి. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఈ పనులు చరిత్రాత్మకం కావాలి. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించలేదు. రూ. 16 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు - నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుంది" అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top