గుంటూరు ఎస్పీని కలువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల హత్యాయత్నం ఘటనపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, పార్టీ నాయకులు గుంటూరు ఎస్పీని కలవనున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివ, దొంతరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్ మరియు ఇతర నాయకులు పాల్గొని, హత్యాయత్నానికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకారం, ఈ దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన, జంగిల్ రాజ్ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, సామాన్యుల భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

Back to Top