మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన కురసాల కన్నబాబు  

మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ‌లో మీడియాతో మాట్లాడారు.

లోకేష్ రెడ్‌బుక్ పట్టుకుని వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు.

నిన్న విడదల రజినీపై దాడి, ఇవాళ అంబటిపై రెండుసార్లు దాడి – అటవిక, జంగిల్ రాజ్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం.

దాడి చేయించిన టీడీపీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంబటికి వెంటనే రక్షణ ఇవ్వాల‌ని క‌న్న‌బాబు డిమాండ్‌

కాకినాడ‌: వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తీవ్రంగా ఖండించారు. కాకినాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..“గతంలో బీహార్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో చంద్రబాబు పాలనలో కనిపిస్తోంది. లోకేష్ రెడ్‌బుక్‌ పట్టుకొని వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా?
ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై దాడి జరగడం జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనం. టీడీపీ నాయకులు ఇంట్లోకి దూరి హత్యాయత్నానికి పాల్పడి, మహిళా నేతల‌తో బూతులు మాట్లాడిస్తున్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా?

తిరుమల లడ్డూ అంశంపై కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో ‘జంతు కొవ్వు లేదు’ అని రిపోర్ట్ వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే భయం తో అంబటిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఎం, మంత్రి లోకేష్, డీజీపీ నివాసం ఉన్న గుంటూరు జిల్లాలోనే అధికార పార్టీ నేతలు ఇంతటి అరాచకానికి పాల్పడ్డారు. సామాన్యులకు ఇక  భద్రత ఎక్క‌డుంటుంది?
నిన్న మాజీ మంత్రి విడదల రజినీపై దాడికి ప్రయత్నం జరిగింది, ఇవాళ అంబటి రాంబాబుపై రెండుసార్లు దాడి జరగడం అటవిక, జంగిల్ రాజ్య పాలనకు నిద‌ర్శ‌నం. ఇది మంచిది కాదు. అధికార పార్టీ పంథా, పద్దతి మార్చుకోవాలి. ఈ ఘటనకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంబటి రాంబాబుకు వెంటనే సురక్షిత భద్రత కల్పించాలని క‌న్న‌బాబు డిమాండ్ చేశారు. 

Back to Top