తణుకులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

తణుకు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరావు  ఆధ్వర్యంలో నిర్వహించారు. పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుందని ఈ సందర్భంగా నేతలు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను, దేవుడిని వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలకు ఆ భగవంతుడే తగిన బుద్ధి చెబుతాడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వ్యవహారంపై జరిగిన అపవాదులు తొలగిన నేపథ్యంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన దేవాలయాలను రాజకీయం కోసం వాడుకోవడం తగదని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Back to Top