గుంటూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. 👉పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్‌తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. 👉టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. 👉కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సం అప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. 👉కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. 👉అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. 👉ఈ దాడిలో పలువురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు.