చెన్నై: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు చెన్నైలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వైయస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ మహోత్సవానికి హాజరైన జగన్, భారతి దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. చెన్నైలోని ప్రముఖ లీలా ప్యాలెస్ హోటల్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పలువురు రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులు సాహిల్, వేదికలకు జగన్ దంపతులు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి జగన్ దంపతులు స్నేహపూర్వకంగా మాట్లాడి, నూతన దంపతులతో ఫోటోలు దిగారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది.