గుంటూరు: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించిన నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయని.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దాడులు, అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ శ్రేణుల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను తన కుమార్తా కాకాణి పూజితతో కలిసి పరామర్శించిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న ఆయన... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందున.. వాటికి జవాబు చెప్పలేక అంబటిని అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. గర్జించే సింహం కంటే.. గాయపడ్డ సింహం ప్రమాదకరమని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులతో భయపెట్టాలని చూడ్డం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే.... జవాబు చెప్ప లేకే అక్రమ అరెస్టులు... టీడీపీ శ్రేణుల దాడి తర్వాత కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు చాలా ధృఢంగా నిలబడ్డం హర్షణీయం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాలమీద, ఆయన చేసిన మోసాలు, అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై అంబటి రాంబాబు ప్రశ్నిస్తు తీరు.. ఈ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ప్రశ్నించడం అంబటి రాంబాబు నైజం.. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజకీయంగా ఇరకాటంలో పడుతున్న కూటమి నేతలు.. పోలీసుల సహకారంతో ఇళ్లపై దాడి చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి నాంది పలికారు. భవిష్యత్తులో దీనిపై మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసుల అండతో అధికార టీడీపీ నేతలు దాడికి దిగుతున్నారు. గాయపడ్డ సింహంతో జాగ్రత్త బాబూ... వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని ఏకంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబు అబద్దపు ప్రచారాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల దగ్గర పూజలు చేశాం. దాన్ని భరించుకోలేక దాడులకు దిగారు. అంబటి రాంబాబు పై దాడి చేయడంతో పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాలమీద దాడికి దిగి తగలబెట్టే కార్యక్రమానికి పూనుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన ఘటన. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంబటి రాంబాబు సహా మేమందరం ప్రజలపక్షమే. అందుకే మా నాయకుడు వైయస్.జగన్ అంబటి రాంబాబుని సింహం అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నేను ఒక్కటే స్పష్టం చేయదల్చుకున్నాను.. గర్జించే సింహం కన్నా, గాయపడ్డ సింహం ప్రమాదకరం అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. అంబటి మౌనిక ప్రశ్నలకు బదులేది? వైయస్ఆర్‌సీపీ నేతలను జైల్లో పెడితే మమ్నల్ని ప్రశ్నించే వాళ్లు ఉండరని భావిస్తున్న చంద్రబాబుది పూర్తిగా తప్పుడు ఆలోచన. మమ్నల్ని అణగదొక్కితే తర్వాత తరం ప్రజలకు అండగా ఉంటుంది. అంబటి రాంబాబు గారెని జైల్లో పెడితే ప్రభుత్వ అక్రమాలపై ఆయన కుమార్తె మౌనిక అడిగిన ఒక్క ప్రశ్నకూ చంద్రబాబు కానీ, కేంద్రమంత్రి కానీ, టీడీపీ నేతలు కానీ సమాధానం చెప్పే పరిస్దితులలో లేరు. మీరు చేసింది అన్యాయం, అక్రమం అన్న విషయం అర్ధమైంది. అంబటి రాంబాబు కక్ష రాజకీయాలకు దూరం. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారు. మీరెన్ని అక్రమ అరెస్టులు చేసినా మీ కుయుక్తులు ఫలించవు. పదవులు తాత్కాలికం, వ్యక్తిత్వం శాశ్వతం, ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డ పైలు మీద సంతకాలు చేసినందున, ఆ అవినీతిలో ఆయన పాత్ర ఉంది కాబట్టే అరెస్టు చేశారు. తనను అరెస్టు చేశారు కాబట్టి.. వైయస్ఆర్‌సీపీ నేతలు అందరినీ అరెస్టు చేయాలని చూడ్డం దుర్మార్గం. తనపై టీడీపీ శ్రేణులు అత్యంత దారుణంగా బూతులు తిడుతూ.. దాడికి ప్రయత్నించినప్పుడు ప్రతిగానే తాను ఆ క్షణంలో అదే స్ధాయిలో ప్రతిస్పందించానని.. అవేశంలో తాను అన్న మాటలకు చింతిస్తూ వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా అంబటి రాంబాబు చెప్పారు. అయినా ఆయన ఇంటిపై దాడికి దిగడం ద్వారా.. ప్రభుత్వం తన ఉద్దేశాలను బయటపెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? మమ్నల్ని కడతేర్చాలన్న ఆలోచన చేస్తారా? వేల సంఖ్యలో బూతులుతో రెచ్చిపోయి, ఇంటిపై దాడికి దిగిన వారిని పోలీసులు బ్రతిమలాడ్డం చూస్తుంటే... ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీరు చేపడుతున్న ఈ కార్యక్రమాల ద్వారా మా పార్టీ నేతలు, మా కుటుంబాలు ఎంతటి మానసిక వ్యధకు గురవుతున్నారో.. అంతకు పదిరెట్లు మీరు మీ కుటుంబాలు మానసిక వ్యధ అనుభవించకతప్పదన్న సంగతి గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి.. వీటిని కొనసాగించినంతకాలం వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలా ఇలాంటి పరిస్ధితిని అందరం కలిసి ఎదుర్కొంటాం. అదే సమయంలో తన తండ్రికి జరిగిన అన్యాయాలపై రాంబాబు గారి కుమార్తె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన తీరు అభినందనీయం. వాటికి సమాధానాలు చెప్పలేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన స్పష్టం చేశారు. పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ.. అంబటి రాంబాబు పై దాడి తెలుగుదేశం పార్టీ వినాశనానికి నాంది. ఈ ప్రభుత్వం పరిపాలించే అర్హత కోల్పోయింది. ఈ రకమైన దాడిని ఎవ్వరూ హర్షించరని తేల్చి చెప్పారు. కాకాణి పూజిత, వైయస్ఆర్‌సీపీ టీడీపీ శ్రేణులు దాడి చేసి, తన తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత కూడా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్లో ఏమాత్రం ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ఆ రోజు నా తండ్రిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులో జైల్లో పెట్టినప్పుడు.. ఆయన బాధ్యతను నేను తీసుకున్న తరహాలోనే ఇవాళ రాంబాబు గారి కుమార్తె మౌనిక ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వారి ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రకంగా అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని కలవాల్సి రావడం దురదృష్టకరం. రాష్ట్రంలో అధికార పార్టీ వైయస్ఆర్‌సీపీని భయపెట్టి, అక్రమ కేసుల పెట్టి ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే.. అంతకు రెట్టింపు ధైర్యం, ఉత్సాహంతో మేమందరం పనిచేస్తాం. వైయస్.జగన్ నేతృత్వంలో కార్యకర్తలు, వైయస్ఆర్‌సీపీ శ్రేణుల అండతో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎలాంటి నేరం చేయకపోయినా రాంబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. అధికారం ఉందన్న అహంకారంతో మీరు దారుణంగా బూతులు తిడుతూ దాడికి ప్రయత్నిస్తుంటే... ఆ టైంలో ఎవరైనా స్పందిస్తారు. అంబటి రాంబాబు గారు కూడా ఆ క్షణం అలాగే స్పందించారు. ఆ తర్వాత తన మాటలను ఎంతో హుందాగా వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఆయన్ను అరెస్టు చేసి దాడి చేసిన వాళ్లను మాత్రం విడిచిపెట్టడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మీ అన్యాయాలను ప్రజలమందుంచి ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి పూజిత స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతల తప్పులను సాక్ష్యాధారాలతో నిరూపించి, శిక్ష పడే రోజును తప్పించుకోలేరని హెచ్చరించారు.