అమరావతి: ఇందాపూర్ డెయిరీ అంశంపై రెండో రోజు వైయస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానంపై వైయస్ఆర్‌సీపీ చర్చకు పట్టుపట్టింది. వైయస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైయస్ఆర్‌సీపీ సభ్యుల ఆందోళనతో ఐదు నిముషాల పాటు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైయస్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతకుముందు భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనమండలికి వైయస్ఆర్‌సీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లారు. లోకేష్‌కు అప్పిరెడ్డి సవాల్ మంత్రి నారా లోకేష్‌కు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాళ్ళిద్దరు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడో చంద్రబాబు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు అని మంత్రి నారా లోకేష్ అనడం హాస్యస్పదం. వాళ్ళిద్దరితో వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్ళు అనడం కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం. ఇందాపూర్ డెయిరీపై మేము చర్చకు పట్టుపడుతున్నాం. మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు.