అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ధ్వంసం

అనంతపురం :  న‌గ‌రంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా నూతన కార్యాలయాన్ని గుర్తుతెలియ‌ని వ్యక్తులు ధ్వంసం చేశారు. విష‌యం తెలుసుకున్న‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు నరేష్‌రెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నిర్మాణ సామగ్రిని పరిశీలించారు. మెటీరియల్‌ను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నాయకులు తెలిపారు.

Back to Top