తాడేపల్లి: క్రైస్తవ సోదర సోదరీమణులు పవిత్ర లెంట్ ఆరంభించగా, ముస్లిం సోదర సోదరీమణులు పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రారంభిస్తున్న ఈ రోజు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపవాసం, ప్రార్థన, ఆత్మపరిశీలనకు అంకితమైన ఈ పవిత్ర కాలం ప్రతి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమ, కరుణ, దానధర్మాల వంటి మానవీయ విలువలను మరింత బలపరచుకుందామని పిలుపునిచ్చారు. మతాల మధ్య సౌహార్దం, సామరస్యం మన రాష్ట్రానికి బలమని పేర్కొంటూ, అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఈ పవిత్ర కాలాన్ని జరుపుకోవాలని వైయస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.