ఎలమంచిలిలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థన 

ఎలమంచిలి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త  కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అచ్చుతాపురం మండల కేంద్రంలోని  వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని, అలాగే తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఆకాంక్షతో స్వామివారిని ప్రార్థించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సాగించిన విషప్రచారాలు ఇకనైనా ఆగిపోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరారు. ఈ పూజా కార్యక్రమంలో మండల ఎంపీపీ కోన సంధ్య బుజ్జి, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు దేశమశెట్టి శంకరరావు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆడటం తగదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Back to Top