కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం.

ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి హాజరుకానున్న అధికారులు.

సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమావేశం.

చీఫ్‌ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:

రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది: 

విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి:

ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే:

అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు:

కాని రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది: 

పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి:

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి :

తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు కూడా రాలేదు :

మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది:

పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి:

 

విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు:

హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం:

దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం:

దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది:

విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది:

ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి:

తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి:

రెవిన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది:

రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది:

 

ఇతర రాష్ట్రాలతో  పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది:

అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది:

 

అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం:

ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత:

మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది:

ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి:

భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది:

ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం:

దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి:

 

కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీని కోరుతున్నాం:

కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి:

దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది:

వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి:

 

కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది:

స్టీల్‌ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి:

దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది:

 

విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది:

విశాఖపట్నం –  వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి:

దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి:

విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలి :

 

వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు:

విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది:

దీంతో ఎయిర్‌ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది:

ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌ పోర్టును నిర్మిస్తున్నారు:

ఈ ఎయిర్‌ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం:

మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది:

విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: 

భోగాపురం ఎయిర్‌ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది:

విజయవాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది:

 

విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలన్న సీఎం:

ప్రైవేట్‌ డెవలపర్‌ 60 శాతం భరిస్తున్నందున,  భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం:

 

రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది:

దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి:

వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Back to Top