‘జగనన్న గోరుముద్ద’ పక్కాగా అమలు చేయాలి

స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌తో శిక్షణ 

ఉన్నతాధకారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో మనబడి నాడు–నేడు పనులపై సమీక్ష అనంతరం జగనన్న గోరుముద్ద, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోరుముద్ద పథకంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. నిర్వహణ కోసం దాదాపు 49 వేల మంది సిబ్బంది అవసరమని, టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌ఓపీ టాయిలెట్‌ నిర్వహణ సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ శిక్షణ ఇస్తుందని చెప్పారు. 
 

Back to Top