ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

పలు వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్‌ప్రాసెసింగ్‌పై ఒప్పందాలు

తాడేపల్లి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టిసారిస్తూ.. నెదర్లాండ్‌ ప్రభుత్వం, 8 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అరటి, టమాటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా, పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో నూతన టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీ, పంట చేతికొచ్చాక అనుసరించాల్సిన విధానాలు, టెక్నాలజీ అంశాలను సీఎం వైయస్‌ జగన్‌కు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేవేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top