ర‌హ‌దారుల‌ను అందంగా తీర్చిదిద్దాలి

ఎయిర్‌పోర్టు నుంచి న‌గ‌రాల‌కు వెళ్లే రోడ్ల‌ను అందంగా తీర్చిదిద్దాలి

టిడ్కో ఇళ్ల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాలి

మురుగు జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

విజయవాడలో కాల్వల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలి

నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఫ్లైఓవర్లు, ఆర్వోబీలను సత్వరమే పూర్తిచేయాలి

ఉన్న‌తాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం స‌మీక్ష

తాడేప‌ల్లి: టిడ్కో ఇళ్ల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని, ఎయిర్‌పోర్టుల నుంచి న‌గ‌రాల‌కు వెళ్లే రోడ్ల‌ను అందంగా తీర్చిదిద్దాల‌ని, మురుగునీటి జ‌లాల శుద్ధిపై అధికారులు ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. టిడ్కో ఇళ్ల‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4,500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు.

నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్షించారు. 16,762 రోడ్లకు సంబంధించి 4,396.65 కి.మీ మేర రోడ్ల కోసం రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని,  ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయ‌ని, వీటితో పాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు తెలిపారు. 15 జూలై కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఇప్పటికే 51.92శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

జగనన్న హరిత నగరాలపై సమీక్ష
ఎయిర్‌ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. నగరం అందాలను మెరుగుపరిచేలా ఉంచాలని, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.

మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయ‌ని, శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాల‌న్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి..? ఎక్కడెక్కడ పెట్టాలి..? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలని సూచించారు. పంట కాల్వల్లో చెత్త , ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణాల్లో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని, అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top