కరోనా వేళ రాజకీయాలొద్దు..

పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దాం

ప్రధానిపై జార్ఖండ్‌ సీఎం ట్వీట్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పందన

తాడేపల్లి: ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరేన్‌ చేసిన ట్వీట్‌పై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి బదులిచ్చారు. ట్విట్టర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘హేమంత్‌ సోరేన్‌ మీరంటే ఎంతో గౌరవముంది. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలుండొచ్చు కానీ, విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని బలహీనంగా చేస్తాయి. కోవిడ్‌ – 19పై చేస్తోన్న యుద్ధంలో మనమంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో ప్రధానిని నిందించే బదులు పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దాం’ అని జార్ఖండ్ సీఎం ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

 

తాజా వీడియోలు

Back to Top