కోటి సంతకాల‌కు మద్దతుగా అనంతపురం విద్యార్ధి లోకం

రెట్టింపు ఉత్సహంతో అనంతలో కోటి సంతకాల సేకరణ

విద్యార్ధి ఉద్యమాలతో దేనినైనా సాధించగలం

కూటమి సర్కార్ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ఆపాలి

పిపిపి విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు తెలిపిన విద్యార్థి లోకం

పేద, బడుగు బలహీన వర్గాల మీద కక్ష కట్టిన కూటమి సర్కార్

అనంతపురం:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంకి మద్దతుగా వైయ‌స్ఆర్‌  విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో గల పలు కళాశాలల్లో విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులతో పిపిపి విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికీ కట్టబేడుతూ పేద మధ్య తరగతి వారికీ అన్యాయం చేస్తున్నదని బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవటం ఇష్టం లేక ఇలా ప్రైవేట్ వారికీ మెడికల్ కళాశాలలని అప్పజేబుతున్నది అంటూ కూటమి ప్రభుత్వం పై ద్వజమేత్తారు ప్రైవేటు పరం కాకుండా చేసే ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కూటమి ప్రభుత్వం దిగి వచ్చేవరకు విద్యార్థి ఉద్యమాలు బలంగా చేయాలని విద్యార్థులకు అయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, ఫయాజ్,నాగేంద్ర,హరీష్,జగన్ రెడ్డి, మెహరాజ్,లోకేష్, సాయియాదవ్,సాయి చరణ్, బాబా ఇమ్రాన్, చరణ్,అశోక్ రాయల్, నరేంద్ర రెడ్డి, వంశీ నాయుడు, భార్గవ్ యాదవ్, గౌస్,తదితరులు పాల్గొన్నారు.

Back to Top