విజయవాడ: రాష్ట్రంలో గో సంరక్షణ చేపట్టాలని కోరుతూ విజయవాడలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద సెంట్రల్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో గో మాంసం ఎగుమతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో గోవధను నిషేధించాలని, గోమాతను రక్షించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , వెస్ట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రా, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.