తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన తిరిగి స్వదేశం చేరుకున్న నేపథ్యంలో అటెండెన్స్ ఇచ్చేందుకు ఆయన రేపు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. రేపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వైయస్ జగన్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్‌పాండ్‌లో ఉన్న తన నివాసానికి చేరుకుంటారని పార్టీకేంద్ర కార్యాలయం వెల్లడించింది.