నంద్యాల: వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని వైయస్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నందికొట్కూరు నియోజకవర్గం వైయస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం కన్వీనర్ డా. దారా సుదీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్పలత రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని సమగ్రంగా, క్రమపద్ధతిగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, వార్డు, మండల స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసే, సమర్థులైన నాయకులకు సముచిత అవకాశాలు కల్పిస్తూ, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, నిర్దిష్ట కాలపరిమితిలో లక్ష్యాలను పూర్తి చేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వైయస్ఆర్‌సీపీనే ప్రజల నిజమైన స్వరం అని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమావేశం కన్వీనర్ డా. దారా సుదీర్ మాట్లాడుతూ, పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.