అనంతపురం: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుత్తి పట్టణంలో బుధవారం పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి పాల్గొని ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరు బీ, ఎంపీపీ విశాలాక్షి , పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు సీవీ రంగారెడ్డి , పట్టణ కన్వీనర్ క్రషర్ మధుసూదన్ రెడ్డి , బీసీ సెల్ అధ్యక్షుడు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు