విజ‌య‌వాడ‌లో కోటి సంత‌కాల‌కు విశేష స్పంద‌న‌

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వర్యంలో రచ్చ‌బండ‌

విజ‌య‌వాడ‌:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మ స్ఫూర్తితో కొన‌సాగుతోంది.  43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి  ఆధ్వ‌ర్యంలో రచ్చ‌బండ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల నుంచి సంత‌కాలు సేక‌రిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది.   వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు వీధుల్లో ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల నుంచి సంతకాలు సేకరించారు.

ఈ సంద‌ర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ..`విజయవాడ పశ్చిమ లో ఇప్పటివరకు 50 వేల మంది సంతకాల సేకరించాం. ప్రజలు స్వచ్చందంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేయకూడని ప్రభుత్వ అభినంలోనే నడపాలని సంతకాలు చేస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని వైయ‌స్ జ‌గ‌న్‌ 17 కాలేజీలకు శంకుస్థాపన చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలోనే ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఎన్నికల కోడ్ సమయంలో మరో రెండు కాలేజీలు నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన స్థలాలను ప్రైవేటీకరణ పేరుతొ దారదత్తం చేసి డబ్బులు దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందించలేకపోతుంది. మెరుగైన ఉచిత వైద్యం పేద ప్రజలకు అందాలంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలోనే నడవాలి` అని వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు డిమాండ్ చేశారు. 

Back to Top