ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్థినుల‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రాజు ప‌రామ‌ర్శ 

అల్లూరి జిల్లా: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం జీటీడబ్ల్యూఏ స్కూల్లో అస్వస్థతకు గురైన విద్యార్థినులను   అల్లూరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే మ‌త్స్య‌రాస విశ్వేశ్వ‌ర‌రావు ప‌రామ‌ర్శించారు. శనివారం రాత్రి పాఠశాలలో విద్యార్థిని ప్రసన్నకీర్తి(15) జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కేక్‌ను 8, 9, 10 తరగతి విద్యార్థులు తిన్నారు. కొద్దిసేపటి తర్వాత కొంత మంది విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. అనంతరం వాంతులయ్యాయి. ఇందులో ఇద్దరికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. మొత్తం 22 మంది బాలిక‌లు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రసన్న కీర్తి(15), హాసిని(11)కి వైద్యులు వైద్యం అందించారు.  

గిరి విద్యార్థులపై ప్రభుత్వం ఇంత నిర్లక్షమా ?  :  ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రాజు 
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ను నిర్వీర్యం చేసి అంధకారంలో నెడుతూ పరిపాలన చెయ్యడం దుర్మార్గమైన చర్య, గత నెలలో కురుపాం నియోజకవర్గం గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 120 మంది విద్యారులు అస్వస్థతకు గురై 5 గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి కళ్లు తెరవకముందే మొన్నటికి మొన్న గూడెం కొత్త వీధి మండలం జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజన్ వల్ల సుమారు 50 మంది విద్యర్థులు ఆసుపత్రి పాలై వారి ఆరోగ్యం మెరుగుకుండానే నిన్న రాత్రి కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం ఆశ్రమ పాఠశాలలో సుమారు 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా దారుణమని అన్నారు, 
 •ఇలాంటి వరుస సంఘటనలు జరగడం వల్ల విద్యార్థుల తల్లి తండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే తీవ్ర భయాందోళనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని శాసన సభ్యులు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పనుండి రాష్ట్ర ప్రజలకు గుడికి వెళ్లినా. బడికి వెళ్లినా తమ మాన ప్రాణాలకు భద్రత కల్పించలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .

Back to Top