రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తిరుప‌తి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుప‌తి తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రిత‌మే రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేపట్లో తిరుప‌తి తాజ్‌హోట‌ల్‌కు చేరుకుంటారు. అక్క‌డ జ‌రిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు.

Back to Top