నేడు నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 09.30 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్‌ చేరుకొని సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే నీతి ఆయోగ్‌ పాలక మండలి 7వ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైయ‌స్సార్‌సీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికార నివాసం 1, జనపథ్‌కు చేరుకుని, అక్కడే బస చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top