తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.