బాబూ రాజేంద్ర ప్రసాద్‌ తెగువ స్ఫూర్తిదాయకం

తొలి రాష్ట్రపతికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళులు
 

అమరావతి : భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ స్వాతంత్ర్య పోరాటంలో చూపిన తెగువ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాజేంద్రప్రసాద్‌ 135వ వర్థంతి సందర్భంగా ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సీఎం గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్‌ ప్రముఖ పాత్రను పోషించారని అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది.

దివ్యాంగులకు సీఎం శుభాకాంక్షలు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు.  ‘విభిన్న సామర్థ్యం గల సోదరులు, సోదరీమణులు అభివృద్ధి చెందడానికి సహకరిస్తాం. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలతో అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాల వైపు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. వారిలోని ఆత్మ సైర్థ్యం మనకు ఎంతో ప్రేరణ’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

Read Also:  మంచి చేస్తున్నా విమర్శలా?

Back to Top