మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించండి

కాలుష్య నివారణ, సుందరీకరణ, చెట్ల పెంపకంపై సమీక్ష
 

అమరావతి: ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో గుర్తించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కాలుష్య నివారణ, సుందరీకరణ, చెట్ల పెంపకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పని చేసిన జీడబ్ల్యూఎస్‌ ప్రతినిధులను అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పరిచయం చేశారు.  కేరళలో చేపట్టిన కార్యక్రమాలను జీడబ్ల్యూఎస్‌ ప్రతినిధులు వివరించారు. కాల్వల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాల్లో జీడబ్ల్యూఎస్‌ సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడలో 4 కిలోమీటర్ల పొడవునా కాల్వను పైలెట్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు.  మురుగునీటిని శుద్ధిచేసిన తరువాతనే కాల్వలోకి విడిచిపెట్టాలని సూచించారు. గోదావరి, కృష్ణా కాల్వల్లో బాగు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు.  గోదావరి, కృష్ణా కెనాల్స్‌ మిషన్‌ను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.

Read Also: వాస్తవాలు మాట్లాడండి చంద్రబాబూ

Back to Top