ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. 

Back to Top