కేంద్ర‌మంత్రి అమిత్ షాతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొన‌సాగింది. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. మొద‌టిరోజు ప్ర‌ధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌మంత్రితో వేర్వురుగా స‌మావేశ‌మైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. రెండో రోజు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించారు.అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్‌ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా అమిత్‌షాతో చ‌ర్చించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top