అమిత్‌షాతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

40 నిమిషాలు సాగిన సమావేశం
 

ఢిల్లీ: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం వైయస్‌ జగన్‌ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. విభజన హామీలపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

Read Also: చంద్రబాబూ..దిగజారుడు రాజకీయాలు మానుకో..

 

Back to Top