చంద్రబాబూ..దిగజారుడు రాజకీయాలు మానుకో..

సీఎం వైయస్‌ జగన్‌ హుందాతనంలో రాజకీయాలు చేస్తున్నారు

పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సరికాదు

చంద్రబాబూ ఎందుకు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు

బుద్ధిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు మళ్లీ రావాలని కోరుకోరు

 

చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ అయితే..లోకేష్‌ అన్‌వ్యాలీడ్‌ నాయకుడు

సీఎం వైయస్‌ జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌తో కోట్ల రూపాయలు ఆదా చేశారు

చంద్రబాబు విలువల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు భాషలో హుందాతనం లేదని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. నవరత్నాలు అమలవుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజలను ప్రాంతాల వారిగా అవమానిస్తూ..చంద్రబాబు రెచ్చగొట్టేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాగే దిగజారి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, మహిళలు వాతలు పెడతారని హెచ్చరించారు. చంద్రబాబు దిగిపోయాక ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు మైడ్‌లోని చిప్‌ చెడిపోయిందని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భాషా నీచంగా ఉందని విమర్శించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తున్నారని, పచ్చ మీడియా తనను మోస్తుందని చంద్రబాబు పదే పదే మీడియాతో మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఏ పని లేక మీడియాతో ఇష్టారాజ్యాంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రజాప్రతినిధులను చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాగే మాట్లాడిన ఎందరో కాలగర్భంలో కలిశారని హెచ్చరించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాగేనా మాట్లాడేదని నిలదీశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాల అమలుపై సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్షం పోరాటం చేయకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అక్కస్సుతో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు మైండ్‌ చెడిపోయిందని, చివరకు ఎవరూ తన పార్టీలో మిగలరన్న అక్కస్సుతో అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంతకన్న దిగజారే స్టేజీ చంద్రబాబుకు లేదన్నారు.  ముఖ్యమంత్రిని దూషిస్తూ, డీజీపీని కబడ్దార్‌ అని పేర్కొనడం చంద్రబాబుకు తగదని, ఆయన భాషను ఎవరూ హర్షించరన్నారు. మా ముఖ్యమంత్రి చట్టానికి ఎవరూ చుట్టం కాదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, పోలీసు వ్యవస్థను కాపాడాలని సూచిస్తున్నారు. రూ.40 లక్షల వరకు పరిహారం చెల్లిస్తానని పేర్కొంటుంటే అందరూ హర్షిస్తున్నారని తెలిపారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీలాగా మా వాళ్లు ఎవరైనా తప్పు చేస్తే వదిలేయండి అని వైయస్‌ జగన్‌ ఎప్పుడు అనలేదన్నారు. మా నేత చట్టం ఎవరికి చుట్టం కాదని పోలీసులకు అధికారం ఇచ్చారన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. నవరత్నాలు అమలవుతుంటే చంద్రబాబు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబుకు తగదని హితవు పలికారు. ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాలని సూచించారు. మాట మాట్లాడితే చాలు పులివెందుల పంచాయితీ, రాయలసీమ రౌడీయిజం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.  రాయలసీమకు చెందిన చంద్రబాబుకు సిగ్గులేకుండా, రెచ్చగొట్టే విధంగా సీమ ప్రజలను హేళనగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇంకొకసారి రాయలసీమ గుండాలన్నా..రౌడీలన్నా..మహిళలు నీకు వాతలు పెట్టడం ఖాయమని హెచ్చరించారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్న చంద్రబాబు తీరు మార్చుకోవాలని సూచించారు. 
మళ్లీ నువ్వే రావాలని ప్రజలంటున్నారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. నువు పోయావు..దరిద్ర్యం పోయిందని, వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పిన హామీలన్నీ వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మంచి పేరు తెచ్చుకుంటున్న వైయస్‌ జగన్‌పై చంద్రబాబు  అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బుద్ధిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు మళ్లీ రావాలని కోరుకోరన్నారు. 

Read Also: అర్చకుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మద్యం విక్రయిస్తున్నారని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. టీడీపీ పాలనలో ఇసుకాసురులు, నరకాసురులు, మట్టి మాఫియా, భూ మాఫియా అంతా కూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. వర్షాల కారణంగా , నదులు పారడంతో కొద్దిగా ఇసుక కొరత ఉందన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్టు షాపులు పెట్టి దుర్మార్గంగా దోచుకున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక బెల్టు షాపులు రద్దు చేయించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యవస్థలను కాపాడాలని మా నాయకుడు పిలుపునిచ్చారని తెలిపారు. అవినీతికి దూరంగా ఉండాలని మా ముఖ్యమంత్రి కార్యకర్తలకు సూచిస్తుంటే మాపై విమర్శలు చేస్తావా అని ప్రశ్నించారు. నీ పాలనలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయలేదనే గత ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు ఎలా విమర్శించామో చూశామన్నారు. ఆయన బావమరిది బాలకృష్ణతో "అంతు తేలుస్తానని, రాష్ట్రంలో, దేశంలో మిమ్మల్ని తరిమికొడతామని మాట్లాడించింది నీవు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఈ రోజు బీజేపీతో బేరసారాలకు దిగింది నీవు కాదా చంద్రబాబు అని నిలదీశారు.

పదేళ్ల పాటు మా పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..నీలాగా దిగజారలేదన్నారు. ఓడిపోయిన వారం రోజులు కూడా చంద్రబాబు తట్టుకోలేకపోయారని, తన ఎంపీలను బీజేపీలోకి పంపించారని తెలిపారు. తనను కాపాడండి అంటూ చంద్రబాబు బినామీలను బీజేపీలోకి పంపించారని విమర్శించారు. బీజేపీలో చేర్పించడమే కాకుండా టీడీపీ పార్లమెంటరీ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసిన చంద్రబాబు ఈ రోజు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి ఒకే  ఒక రాజ్యసభ్యుడు ఉన్నా కూడా మడమ తిప్పకుండా పోరాటం చేశారని, మా కార్యకర్తలను ఎంతగా మీరు హింసించినా ఎక్కడా బయపడలేదన్నారు. మా పార్టీని ఎక్కడా కూడా విలీనం చేయలేదని తెలిపారు. పులులు, మేకలని చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పులి లాంటి వ్యక్తి అని, అలాంటి పులి కడుపున పులే పుట్టిందన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడటంతో టీడీపీ ఎమ్మెల్యేలే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అచ్చెన్నాయుడిని ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. మా ఎమ్మెల్యేలను మేకలతో పోల్చుతూ దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.

మీ కుమారుడు మాలోకం అగ్రిగోల్డు బాధితులకు రూ.300 కోట్ల చెక్కులు ఇచ్చారని, ఆ చెక్కుపై సంతకం చేయకుండా ఎలా ఇస్తావని ప్రశ్నించారు. మా నాయకుడు సీఎం అయిన వెంటనే డబ్బులు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అన్‌వాల్యూడ్‌ అయ్యారని, వైయస్‌ జగన్‌ అప్‌డెటేడ్‌ అయ్యారని వివరించారు. నారా లోకేష్‌ను ప్రయోజకుడిగా చేయలేకపోయారన్న భావన చంద్రబాబుకు ఉందన్నారు. నీ కొడుకు ఏం చేయలేకపోతున్నారని చంద్రబాబు ప్రెస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతరులపై పడి ఏడ్చుతున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమా గ్రాఫిక్స్‌ పేరుతో పోలవరాన్ని ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు ఆయన మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. వందల, వేల కోట్లు దోచుకొని దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తోలుబొమ్మ ఆటలో దేవినేని ఉమా పాత్ర విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేస్తే..దాన్ని వైయస్‌ జగన్‌ చక్కదిద్దుతున్నారని వివరించారు. మా నాయకుడు మాకు హుందాగా వ్యవహరించాలని చెబుతున్నారని, మేం కూడా నీలాగా దిగజారితే మీ కంటే ఘోరంగా మాట్లాడగలమన్నారు. మేం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఐదు నెలల పాలనలో వైయస్‌ జగన్‌ దేశానికే రోల్‌మాడల్‌గా మారారని, ఆయన్ను చూసి ఓర్వలేక చంద్రబాబు ఏడ్చుతున్నారని తప్పుపట్టారు. చంద్రబాబు తన భాషను కంట్రోల్‌ చేసుకోలేకపోతే మహిళలే వాతలు పెడతారని హెచ్చరించారు.

Read Also: అర్చకుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top