విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అర్చకుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల చిరకాల స్వప్పమైన వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవో కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్చకులకు వంశపార్యంపర హక్కు కల్పిస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని సోమవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రహ్మణులు ఫోన్లు చేసి సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని, హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే చట్టం అమల్లోకి తీసుకురావడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2007 లో మహానేత వైయస్‌ఆర్ అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకురాగా, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. జీవో నంబర్ 76ను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. Read Also: కాసేపట్లో అమిత్‌షాతో సీఎం వైయస్ జగన్ భేటీ