కాసేపట్లో అమిత్‌షాతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

ఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీకానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో సీఎం భేటీ అవుతారు. విభజన హామీలు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

Read Also: సొంత నియోజవర్గంలోనూ బాబు అవినీతి

Back to Top