సొంత నియోజవర్గంలోనూ బాబు అవినీతి

కుప్పం సబ్ కాల్వ పనుల్లో కొండంత అవినీతి

రూ.430.26 కోట్ల కాంట్రాక్టుకు కన్నం

మొదలౌతున్న విజిలెన్సు విచారణ

కుప్పం కాల్వ పనులకు అంచనాలు పెంచి, అదనపు చెల్లింపులు చేసిన టీడీపీ నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సొంత నియోజవర్గంలో పనుల్లో కూడా అవినీతి కక్కుర్తేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు కుప్పం వాసులు. ఈపీసీ ద్వారా రూ.430.26 కోట్ల పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు 123.641 కిలోమీటర్ల కాలవ తవ్వకం పనులు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ అవి పూర్తి కాలేదు.
 కాంట్రాక్టులో భాగంగా 324 స్ట్రక్చర్స్ 5 చోట్ల, ఎన్‌ హెచ్ క్రాసింగ్ పనులు 3 చోట్ల, ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేయాలి. దీంతో 110 చెరువులకు నీరు అందించే పనులు 9 నెలల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టులో ఉంది. అయితే ఆ పనులు ఇవాల్టీకీ పూర్తి కాలేదు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో అధికమొత్తానికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ఖజానాకు వందల కోట్ల నష్టం తెచ్చారు. సోమవారం దీనిపై విజిలెన్సు అధికారులు, ఎన్‌ ఫక్షర్సుమెంట్ డిప్యూటీ ఇంజనీర్లు, జేఈలు తనిఖీలు చేసారు. కాల్వ పనులను పరిశీలించి నివేదక సిద్ధం చేస్తున్నారు. ఇందులో అవకతవకలు బయటపడితే బాబుకు బ్యాండ్ బాజే...అన్నమాట. 

Read Also: అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Back to Top