పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

మాజీ మేయర్‌ నూర్జహాన్‌ కుమార్తె వివాహానికి హాజరు

ఏలూరు పర్యటన ముగించుకొని తాడేపల్లి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

పశ్చిమగోదావరి: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న‌లు చేశారు. తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ పనులకు, ఏలూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. దాదాపు రూ.330 కోట్ల నిధులతో నగరంలో చేపట్టే పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.  అనంతరం వీవీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ నుంచి నేరుగా శ్రీసూర్య కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు. ఏలూరు పర్యటనలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు తదితరులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top