ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు తెలిసిన ప్ర‌భుత్వం ఇది

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి

రాష్ట్ర‌వ్యాప్తంగా వైద్యం ఖ‌ర్చు రూ.1,000 దాటితే డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ.. 

డిశ్చార్జ్ అయ్యే వ‌ర‌కు అన్ని ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.

 డాక్ట‌ర్ వైయ‌స్సార్‌ ఆరోగ్య‌శ్రీ సేవ‌లను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి: ప‌్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు తెలిసిన ప్ర‌భుత్వం మాద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 24*7 గ్రామాల్లో కూడా వైద్యం అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని, పేద‌వాడు వైద్యానికి ఇబ్బంది ప‌డే రోజులు ఇక ఉండ‌వ‌ని సీఎం వెల్ల‌డించారు. ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే డాక్ట‌ర్ వైయ‌స్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందిచే కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువ‌స్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాల‌యంలో లాంఛ‌నంగా ప్రారంభించారు.  ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్లు, వైద్యాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ముఖాముఖి మాట్లాడారు.

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం ముఖ్యాంశాలు ఇలా..

 • - ఆస్పత్రిలో వైద్యం ఖ‌ర్చు వెయ్యి రూపాయలు దాటితే వైయ‌స్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందిచే కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువ‌చ్చాం.
 • -  ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.  
 • - వైద్య ఖ‌ర్చు రూ.1000 దాటితే ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చాం
 • -రూ.5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్నా ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోని తీసుకువ‌చ్చాం
 • - నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు రూ.680 కోట్లు బ‌కాయిలు ఉన్నాయి
 • -డ‌యాల‌సిస్ రోగుల బాధ‌ల‌ను ద‌గ్గ‌ర నుంచి చూశాను
 • - ఆసుప‌త్రుల్లో ఎలుక‌లు కొరికితే చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం.
 • - అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తున్నాం
 • -బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లోనూ సూప‌ర్ స్పెషాలిటీ చికిత్స అందిస్తున్నాం
 • - కోవిడ్ ట్రిట్‌మెంట్ కూడా ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చాం.
 • -డిశ్చార్జ్ అయ్యే వ‌ర‌కు అన్ని ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.
 • - రాష్ట్రంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 10,032 వైయ‌స్ఆర్ విలేజ్ క్లినిక్స్ తెస్తున్నాం
 • - 560 అర్బ‌న్ క్లినిక్స్ ఇవాళ వార్డుల ప‌రిధిలో నిర్మాణంలో ఉన్నాయి
 • -1147 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు అన్ని కూడా రూపు రేఖ‌లు మార్చ‌బోతున్నాం
 • -52 ఏరియా ఆసుప‌తు‌లు,191 క‌మ్యూనిటి సెంట‌ర్ల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాం.
 • - ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక మెడిక‌ల్ కాలేజీ, ఒక న‌ర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.
 • గ‌తంలో కేవ‌లం 11 మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే ఉండేవి. కొత్త‌గా మూడు క్యాన్స‌ర్ ఆసుప‌త్రులు, గిరిజ‌నుల‌కు 6 మ‌ల్టి స్పెషాలిటి ఆసుప‌త్రులు నిర్మాణాల‌కు శ్రీ‌కారం చుట్టాం. 
 • -గ‌తంలో 108, 104 వాహ‌నాల దుస్థితి చూశాం
 • - రాష్ట్రంలో ఇటీవ‌లే 1080 కొత్త‌గా 108 వాహ‌నాలు ప్రారంభించాం. 
 • - ప్ర‌తి ఆసుప‌త్రిలో ఉండాల్సిన సంఖ్య‌లో డాక్ట‌ర్లు, న‌ర్సుల‌ను నియ‌మించాం.1012 మంది వైద్య సిబ్బందిని  నియ‌మించాం. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఎక్క‌డా కొర‌త లేకుండా చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామంలో కూడా 24*7లో వైద్యం అందిలే చ‌ర్య‌లు తీసుకున్నాం.
 • - ఆరోగ్య‌శ్రీ వైద్యాన్ని ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నాం. ఇంకా వ్య‌వ‌స్థ‌ల‌ను బాగుచేయాల‌నే త‌లంపుతోనే ఇవ‌న్నీ చేస్తున్నాం. 
 • - ఇది ప్ర‌జ‌ల గుండె చప్పుడు తెలిసిన ప్ర‌భుత్వం ..ప్రాణం విలువ తెలుసు కాబ‌ట్టే వైద్యానికి ఇంత ప్రాధాన్య‌త ఇస్తున్నాం.
 • - ఇంకా మంచి ప‌నులు చేసేందుకు దేవుడు ఆశీర్వ‌దించాల‌ని, ప్ర‌జ‌లంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లు కావాల‌ని కోరుకుంటూ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top