అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దర్శనం అనంతరం అర్చన, మంత్రపుష్ప‌ సమర్పణ, ఆశీర్వాదం తరువాత వేదపండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామివారి నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. 

అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంలోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు. అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అయిన తరువాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మించారు. నూతన రథం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ సెప్టెంబర్‌ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నూతన రథం నిర్మాణానికి రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. లక్ష్మినరసింహస్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్‌ టేకును రథం కోసం వినియోగించారు.  
 

Back to Top