‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ ప్రారంభం

తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రకటించింది. ఈ మేరకు ‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. దసరా పండుగ రోజున మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇది తన అదృష్టంగా, దేవడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందన్నారు. ‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, పినిపె విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్‌ కే రోజా, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. 
 

Back to Top