ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ పెంపు

రిటైర్మెంట్‌ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపుదల

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం

తాడేపల్లి: ఉద్యోగులకు వైయస్‌ జగన్‌ సర్కార్‌ తీపికబురు అందించింది. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 23 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సీఎం వైయస్‌ జగన్‌ మరోసారి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని అన్ని సంఘాలు హాజరయ్యాయి. ఈ భేటీలో పీఆర్సీ పెంపుపై ప్రకటన చేశారు. ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. ఈ స‌మావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top