గిరిజ‌న ప్రాంతాల్లో 4జీ సేవ‌లు

300 సెల్ ట‌వ‌ర్స్‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. గిరిజ‌న ప్రాంతాల్లో 300 4జీ సెల్ ట‌వ‌ర్స్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వ‌ర్చువ‌ల్‌గా సెల్ ట‌వ‌ర్స్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు.  
కార్య‌క్ర‌మంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్‌ (ఐటీశాఖ) డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top