మానవత్వం పరిమళించి స్పందించిన సిఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి

ఇద్దరి చిన్నారుల వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చొప్పున  ఆర్థిక సహాయం

ఇచ్చిన హామీ రెండు గంటల్లో అమలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  ఇటీవల పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వ‌చ్చిన గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటన లో భాగంగా రాజమహేంద్రవరం కు సోమవారం సాయంత్రం వ‌చ్చారు. 
ఆ సందర్భంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి కలిసిన సందర్భంలో ప్రజలను కలిసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

సిఎం ను కలిసిన అర్జి దారులు: 

కొవ్వూరు మండలం సీతం పేటకు చెందిన నాగలక్ష్మి, గోవింద్ దంపతుల కుమార్తె లక్ష్మి రేణుక బైలేర్టల్ నాడ్యులర్ వ్యాధి (ఊపిరి తిత్తుల సమస్య) తో బాధపడుతున్నట్లు తెలియచేసి, తమ పాప వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేమని , తమ కుమార్తె కు వైద్య కోసం అభ్యర్థించారన్నారు.  స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణ ఆర్థిక సహాయం గా లక్ష రూపాయల అందించి పాపకు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని ఆదేశించడం జరిగిందని, ఆమేరకు లక్ష్మి రేణుక తల్లి నాగమణి కు లక్ష రూపాయలు చెక్కు అందించినట్లు కలెక్టర్ మాధ‌వి ల‌త తెలిపారు.

గోపాలపురం భీమోలు కి చెందిన జీ. నాగలక్ష్మి తన అర్జిలో వారి భర్త రోజూ వారి కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించడం జరుగుతోందని, తమ 5 ఏళ్ల బాబు గుబ్బాలయ్య తలసేమియా వ్యాధి తో బాధపడుతూ న్నట్లు సిఎం దృష్టికి తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాపకు తక్షణ సహాయం నిమిత్తం లక్ష రూపాయల ఇవ్వమని, తదుపరి బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మాధవీలత తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు పాప తక్షణ ఆర్థిక సహాయం గా లక్ష రూపాయల చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు.

తమ పిల్లల వైద్య సేవలు నిమిత్తం ముఖ్యమంత్రి స్వయంగా  స్పందించి రెండు గంటల్లో ఇచ్చిన హామీ కి ముందస్తు భరోసాగా లక్ష రూపాయల చొప్పున చెక్కు ఇవ్వడం పట్ల ఆ పిల్లల తల్లితండ్రులకు ఎనలేని గుండె ధైర్యం ఇచ్చినందుకు  వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top