ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు బీఫాంలు అందించిన సీఎం

తాడేప‌ల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బీఫాంలు అంద‌జేశారు. శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌ను వంశీకృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌, తూమాటి మాధవరావు, డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. స్థానిక సంస్థ‌ల కోటాలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌, తూమాటి మాధవరావు, డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ భీఫాంలు అంద‌జేశారు. 

తాజా ఫోటోలు

Back to Top