పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం జాతీయ సంస్థలతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు శిక్షణ అందిస్తామన్నారు. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తామని వివరించారు. రైతులు కట్టాల్సిన పంట బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 60 శాతం ఫీడర్లలో 9 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, జూలై నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా ఉచిత విద్యుత్‌ అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top