నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

అన్న‌మ‌య్య జిల్లా: రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్‌ మహ్మద్‌ రఫీ కుటుంబ సభ్యుల వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. రాయ‌చోటిలోని రాజధాని ఫంక్షన్‌ హాల్లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వరుడు మహ్మద్‌ నిహాజ్, వధువు నూర్‌ ఈ చష్మిలను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీ‌నివాసులు ఉన్నారు. 

Back to Top