ప్ర‌తి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ``మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు`` తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top